FbTelugu

వాలంటీర్లకు ఫోన్లపై హైకోర్టులో వాదనలు

అమరావతి: వార్డు వాలంటీర్లకు ఫోన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై ఇవాళ వాదనలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల సమయంలో మొబైల్ వినియోగం చట్టవిరుద్దమని పిటిషనర్ అభ్యంతరం తెలిపారు.

ఫోన్ల ద్వారా ఓటర్లపై ఒత్తిడి తెచ్చే అవకాశముందని పిటీషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. వార్డు వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని ఎస్ఈసి ఆదేశాలున్నాయని ఎస్ఈసి తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలు అందించేందుకు న్యాయవాది సమయం కోరగా, హైకోర్టు తదుపరి విచారణ మార్చి 1వ తేదీ కి వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.