FbTelugu

రాయలసీమలో హత్యలు సాధరణమా!?: డాక్టర్ సునీతారెడ్డి

న్యూఢిల్లీ: మా నాన్న వైఎస్.వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారో ఇప్పటికి తెలియదని, ఆ హత్య ఇప్పటికీ మిస్టరీగానే ఉందని ఆయన కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి అన్నారు. హత్య జరిగి రెండేళ్లు అవుతోందని, ఇప్పటికీ నిందితులను పట్టుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవాళ సునీతా రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మా నాన్న, మాజీ ఎంపి వివేకానంద రెడ్డి హత్య జరిగి రెండు సంవత్సరాలు కావస్తున్నా హంతకులను పట్టుకోలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తమ్ముడికే న్యాయం జరుగకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నా, మా సోదరుడు సిఎం వైఎస్.జగన్ ఉన్నా  మాకు న్యాయం జరగడం లేదన్నారు. హత్యపై సిబిఐ విచారణ సరిగా జరగడం లేదని, న్యాయం కోసం ఇంకెన్నాళ్లు వేచి ఉండాలని ఆమె నిలదీశారు. ఈ హత్య గురించి వదిలేయాలని పలువురు తనకు సూచనలు, సలహాలు ఇచ్చారన్నారు. అయితే తన మనస్సాక్షి మాత్రం న్యాయం కోసం పోరాడాలని చెబుతోందన్నారు.

మా నాన్న హత్య తరువాత నిజానిజాలు వెలికి తీయాలని కొందరు అధికారులను కలిశానని, అయితే వారిచ్చిన సమాధానాలు నివ్వెరపర్చాయన్నారు. కడప జిల్లాలో, రాయలసీమలో ఇలాంటి హత్యలు సాధారణమని అన్నారన్నారు. హత్యలు జరగడం, చేయడం సాధారణం ఎలా అవుతుందో తనకు అర్థం కావడం లేదన్నారు. ఈ హత్య కేసులో కీలక సాక్షులకు హాని జరుగుతుందేమోనన్న భయం తనకు పట్టుకుందని సునీత ఆందోళన వ్యక్తం చేశారు. నాన్న హత్య గురించి ఎవరితోనైనా మాట్లాడేండుకు, వాస్తం చెప్పేందుకు భపడే పరిస్థితి నెలొకొందని ఆమె అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.