FbTelugu

అయోధ్యలో భూముల రేట్లు పెరుగుతున్నాయా?

అయోధ్య: రామ మందిరం భూమి పూజ తరువాత చుట్టు పక్కల ప్రాంతాల్లో భూముల విలువలు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా లాక్ డౌన్ తరువాత దేశంలో భూముల ధరలు కొన్ని ప్రాంతాల్లో పడిపోగా, మరికొన్ని ప్రాంతాల్లో స్థిరంగా ఉన్నాయి.
ఇందుకు విరుద్ధగా అయోధ్య నగరం చుట్టుపక్కల మాత్రం రెట్టింపు అయ్యాయి. నెల రోజుల వ్యవధిలోనే భూముల విలువలు రెండింతలు కావడంతో స్థానికులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక నగరంగా విరాజిల్లే అవకాశం ఉండడంతో కొనుగోళ్లు పెరగియి. వ్యాపార, వాణిజ్య సముదాయాల కోసం పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేస్తున్నారు.

ఆగస్టు నెలలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరగ్గా, ప్రధాని, యూపీ ముఖ్యమంత్రి, ఆర్ఎస్ఎస్ నేతలు పాల్గొన్న విషయం తెలిసిందే.
ఈ ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు, త్రీ, ఫైవ్ స్టార్ హోటళ్లను నిర్మించేందుకు తమ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన విషయం విధితమే. సీఎం ప్రకటన తరువాత రియల్టర్లు ఈ ప్రాంతంపై ఎక్కువగా దృష్టి సారించడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.