FbTelugu

ప్రశ్నించేవారు జాతి వ్యతిరేకులా?: కమల్

చెన్నై: ప్రశ్నించేవారిని జాతి వ్యతిరేకులుగా చిత్రించడం ఏమాత్రం సరికాదని, ప్రశ్నించడం పౌరుల ప్రజాస్వామిక హక్కు అని మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు  కమల్ హాసన్ స్పష్టం చేశారు.

లాద్దాఖ్ గల్వాన్ లోయలో చైనా సైనికుల దాడి, 20 మంది భారత సైనికుల మృతిపై ప్రధాని మోదీ ప్రజలను భావోద్వేగాలతో తప్పుదారి పట్టించారని ఆయన ఆరోపించారు. అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. చైనా మన భూ భాగాన్ని ఆక్రమించలేదని, మన పోస్టును స్వాధీనం చేసుకోలేదని ప్రధాని చెప్పారన్నారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలను వ్యాఖ్యలను ప్రశ్నించిన వారిపై తప్పు డు వక్రీకరణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఇలాంటి చౌకబారు ప్రచారం మనుకోవాలని కమల్ హాసన్ ప్రధాని మోదీ, ఆయన మద్దతుదారులను కోరారు. మోదీ అఖిల పక్షంలో వెల్లడించిన అంశాలు, ఆర్మీ ప్రకటనలకు భిన్నంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.