FbTelugu

20 నుంచి ప్రథమ్‌లో బస్సు టికెట్లు: ఆర్టీసీ

విజయవాడ: ఆర్టీసీ బస్సు ప్రయాణీకుల కోసం ప్రథమ్ అనే యాప్ ను రూపొందించింది. ఈ నెల 20వ తేదీ నుంచి యాప్ వినియోగంలోకి వస్తుందని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.

ప్రయోగాత్మకంగా తొలుత 19 డిపోల పరిధిలో యాప్‌ ద్వారా టికెట్లు జారీ చేస్తామని ఆర్టీసీ ఎం.డీ మాదిరెడ్డి ప్రతాప్‌ తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు-1, రాజమహేంద్రవరం, ఏలూరు, శ్రీకాకుళం-1, అనకాపల్లి, మచిలీపట్నం, విజయనగరం, గుంటూరు -1,2, అమలాపురం, రావులపాలెం, చిత్తూరు-2, తాడిపత్రి డిపోల్లో టికెట్లు జారీ చేస్తారని ఆయన అన్నారు.

కరోనా వ్యాపించకుండా కండెక్టర్లు, డ్రైవర్లు ప్రత్యేక మొబైల్‌ సమకూర్చుకోవాలని ఆదేశించారు. సూచించిన ప్రమాణాల మేరకు స్మార్ట్‌ ఫోన్లు సమకూర్చుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.