FbTelugu

తప్పు జరిగింది అమ్మా.. క్షమించాలి: ఏపీఎస్ఆర్టీసీ వేడుకోలు

విజయనగరం: వైద్యం చేయించుకుని తిరిగి బస్సులో వస్తున్న ఒక వృద్దుడు చనిపోవడంతో బస్సు డ్రైవర్ అతని మృతదేహాన్ని దింపి వెళ్లిన ఘటన పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఏపీఎస్ ఆర్టీసీ పశ్చాత్తాపం వ్యక్తం చేసింది.

ఈ నెల 22న వృద్ధుడి మృతదేహాన్ని దించేసి బస్సు వెళ్లిపోవడంపై రవాణ శాఖ మంత్రి పేర్ని నాని సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణించేవారిపై సిబ్బంది మానవత్వం చూపించాలని, అలా అర్థాంతరంగా మృతదేహాన్ని వదిలి వెళ్తే ఎలా అని ఆయన మండిపడ్డారు. మంత్రి ఆగ్రహంతో విజయగరం, పార్వతీపురం ఆర్టీసీ డిపో మేనేజర్లు సాలూరు బంగారమ్మ కాలనీలో దాసరి పైడయ్య ఇంటికి వెళ్లారు. ఆయన భార్య పోలమ్మను పరామర్శించి, జరిగిన సంఘటనకు తాము పశ్చాత్తాప పడుతున్నామని, క్షమించాలని ఆమెను వేడుకున్నారు. ఇక నుంచి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.