FbTelugu

మంత్రి మాటకు విలువ లేదా?

అమరావతి: రవాణ శాఖలో మంత్రి పేర్ని నాని మాటకు విలువ లేకుండా పోయిందా అంటే అవుననే విధంగా ఎపీఎస్ఆర్టీసీ యాజమాన్యం వ్యవహరిస్తోంది.

ఏపీఎస్‌ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి అధికారులు షాక్ ఇచ్చారు. కాంట్రాక్ట్‌ ముగిసిందని.. నేటి నుంచి విధులకు రావొద్దంటూ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏపీఎస్‌ఆర్టీసీ ఆఫీసు నుంచి ఫోన్లు వెళ్లాయి.ఉద్యోగులను తొలగించబోమని గతంలో చెప్పిన మంత్రి పేర్ని నాని మంత్రి మాటకు విలువ లేకుండా పోయిందని ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వాపోతున్నారు.

ఈ నిర్ణయంతో ఆందోళనలో 7800 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది రోడ్డున పడుతున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే నిరుద్యోగులతో పాటు ప్రైవేటు ఉద్యోగులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఆర్టీసీ నిర్ణయంతో ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా అర్థాకలితో అలమటించే పరిస్థితి ఏర్పడింది. మంత్రి పేర్ని నాని జోక్యం చేసుకుని తమను ఆదుకోవాలని సిబ్బంది కోరుతున్నారు.

You might also like