FbTelugu

ఏపీపీఎస్సీ నియామక పరీక్షల తేదీలు ఖరారు

అమరావతి: ఉద్యోగాల నియామకాల ప్రక్రియకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధo చేస్తున్నది. గత నోటిఫికేషన్లకు నియామక పరీక్ష నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకున్నది.

ఏపీపీఎస్సీ పలు ఉద్యోగాల నియామక పరీక్షల తేదీలను ఖరారు చేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో గతంలో వాయిదా వేసిన పలు పరీక్షలకు తేదీలు ఖరారు చేసింది. ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు పరీక్షల తేదీల వివరాలతో ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్‌ 15 నుంచి ఉద్యోగ నియామక పరీక్షలు ప్రారంభించనున్నారు. నవంబర్‌ 13 వరకు పలు రోజుల్లో కొనసాగనున్నాయి.

– సెప్టెంబర్‌ 15, 16 తేదీల్లో డిగ్రీ కళాశాల లెక్చరర్ల నియామక పరీక్షలు

– సెప్టెంబర్‌ 21, 22, 23, 24 తేదీల్లో గెజిటెడ్‌ ఉద్యోగాలకు

– సెప్టెంబర్‌ 21, 22 అసిస్టెంట్‌ బీసీ/సోషల్‌/ట్రైబల్‌ వేల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు

– సెప్టెంబర్‌ 22న రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌ మైనింగ్‌ సర్వీస్‌ ఉద్యోగాలకు

– సెప్టెంబర్‌ 23న సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ ఉద్యోగాల నియామక పరీక్ష

– సెప్టెంబర్‌ 23న పోలీసు విభాగంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు

– సెప్టెంబర్‌ 23, 24 పట్టణ ప్రణాళిక విభాగంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టుల భర్తీకి పరీక్షలు

You might also like