FbTelugu

యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది….

ఒకప్పుడు యాపిల్ కంపెనీ బాటలో మిగతా మొబైల్ కంపెనీలు పరుగులు తీసేవి. కాలం మారింది. ఇప్పుడు యాపిల్ కంపెనీ మిగతా కంపెనీల బాట పట్టక తప్పడం లేదు.
గత కొద్ది రోజులు మడత పెట్టే ఫోన్లపై జనానికి క్రేజ్ పెరిగింది. ఇప్పటికే శాంసంగ్ తో పాటు మోటరోలా, ఎల్జీ కంపెనీలు ఈ రకమైన ఫోన్ ను ఆవిష్కరించాయి. అయితే ఫోల్డబుల్ ఫోన్ పై యాపిల్ ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు.

ఇది అచ్చం శాంసంగ్ గెలాక్జీ జెడ్ ప్లిప్ ఫోన్ మాదిరే ఉంటుందని, క్లామ్ షెల్ ఐ ఫోన్ లను షెంజన్ ఫాక్సాన్ ఫ్యాక్టరీలో పరిక్షిస్తున్నారని టెక్ నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా ఈ ఫోన్ కీ ల బలాన్ని తనిఖీ చేయడానికి పరీక్షలు ముమ్మరంగా జరుగుతున్నాయి. స్క్రీన్ కోసం ఎల్ఈడీ లేదా మైక్రో ఎల్ఈడీ ఉపయోగించవచ్చని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది చివరి త్రైమాసికం లేదా 2023 ప్రథమార్థంలో విడుదల చేయవచ్చని అంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.