FbTelugu

కేసీఆర్ ను కలిసిన ఆపిల్ రైతు

హైదరాబాద్: ధనోరాకు చెందిన రైతు బాలాజీ సీఎం కేసీఆర్ ను మంగళవారం ప్రగతి భవన్ లో కలిశారు. తన వ్యవసాయ క్షేత్రంలో సాగు చేసిన ఆపిల్ పండ్లను సీఎం కేసీఆర్ కు అందచేశారు.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆపిల్ మొక్కను, పండ్ల బుట్టను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ప్రగతి భవన్ రావాల్సిందిగా సీఎంఓ అధికారులు బాలాజీకీ సోమవారం ఫోన్ లో కోరారు. అధికారుల వినతి మేరకు ఆయన ఇవాళ ప్రగతి భవన్ వచ్చారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామంలో 2 ఎకరాల్లో హెచ్ఆర్ 99 ఆపిల్ పంటను సాగుచేసినట్లు రైతు బాలాజీ తెలిపారు. తెలంగాణ ఉద్యానవన శాఖ పంట సాగులో ఎనలేని సహకారాన్ని అందించిందని ఆయన చెప్పారు. కేసీఆర్ ప్రోత్సాహంతో ఆపిల్ పంట సాగు పై మరింతగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు బాలాజీ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బాలాజీని అభినందించారు.

You might also like