FbTelugu

ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్

అమరావతి: నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావు కేసులో హైకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ కు వెళ్లనున్నది.

ఈ కేసుపై న్యాయ నిపుణులతో చర్చల అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ కేసులో ప్రభుత్వం విచారణపై నమ్మకం లేదంటూ హైకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగిగా కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించనందునే సుధాకర్ పై సస్పెన్షన్ వేటు వేసామన్నది ప్రభుత్వ వాదించింది.

మొన్నటి వివాదంలో కూడా సుధాకర్ సీఎం జగన్ రెడ్డి ను వ్యక్తిగతంగా, ప్రభుత్వాన్ని తీవ్రంగా ఉద్దేశ్య పూర్వకంగా ఆరోపణలు చేసినా ఆ వాదనలను హై కోర్టు పట్టించుకోలేదన్న భావనలో ప్రభుత్వం ఉంది. కేవలం మేజిస్ట్రేట్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు ఎలా ఇస్తారని ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం పరుస్తోంది.

You might also like