FbTelugu

మత్స్యకారుల వలసలు తగ్గిస్తాం: అప్పలరాజు

అమరావతి: మత్స్యకారులకు ఉపాధి కల్పించి వలసలు తగ్గించేందుకు ప్రయత్నిస్తామని రాష్ట్ర మత్స్య, పశు సంవర్దక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. ఇవాళ ఆయన సచివాలయంలో రాష్ట్ర మత్స్య, పశు సంవర్దక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడారు.

తనకిచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని అన్నారు. ఆక్వా అథారిటీ యాక్ట్ బిల్లుపై మొదటి సంతకం చేశారు. మత్స్య కారుడైన తనకు అదే శాఖ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. మత్స్యకారులకు అవసరమైన అన్ని కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఆక్వారంగానికి కరెంటు యూనిట్ రూపాయున్నరకే ఇస్తున్నామన్నారు. పాలసేకరణ ధర పెంచుతున్నామన్నారు. పేదప్రజల జీవనప్రమాణాలు పెరగాలని ముఖ్యమంత్రి అహర్నిశలు పనిచేస్తున్నారని అన్నారు.

You might also like