FbTelugu

కత్తి మహేష్ కు కంటిచూపు కష్టమేనా?

చెన్నై: సినిమా విమర్శకుడు, బిగ్ బాస్ ఫేమ్ కత్తి మహేష్ కు ఇవాళ అపోలో వైద్యులు శస్త్ర చికిత్స చేస్తున్నారు. ఎడమ కంటి చూపు తిరిగి రావడం అసాధ్యమని వైద్యులు తెలిపారని మహేష్ మామ ఎం.శ్రీరాములు తెలిపారు.

నెల్లూరు జిల్లాలో ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న కత్తి మహేష్ కు ప్రమాదం జరగింది. నిలిచి ఉన్న కంటైనర్ ను వెనకాల నుంచి ఇన్నోవా కారు ఢీకొట్టడంతో ముందు సీట్లో కూర్చున్న ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఏయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నా తల, ముక్కు తో పాటు కంటికి గాయాలు అయ్యాయి. నెల్లూరులో చికిత్స చేసినప్పటికీ మరింత మెరుగైన చికిత్స కోసం అపోలో హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స అందుతోంది. మెదడు నుంచి ఎలాంటి రక్తస్రావం జరక్కపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఇవాళ శస్త్ర చికిత్స జరిగిన తరువాత రెండు కళ్లకు చూపు వస్తుందా లేదా అనేది స్పష్టం కానున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.