FbTelugu

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకం: చంద్రశేఖర్‌రెడ్డి

ప్రకాశం: విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఏపీఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ పరిశ్రమపై 40వేల మంది ఉద్యోగులు ఆధారపడి ఉన్నారన్నారు.

పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందుతున్నారని, అలాంటి పరిశ్రమను నష్టాల సాకుతో ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమన్నారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఉద్యోగస్థులు ప్రాణ త్యాగానికి సిద్దంగా ఉన్నారని ఆయన అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సిఎం వైఎస్.జగన్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్‌కి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. ఏప్రిల్ నెలలో పీఆర్సీ ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని, ఉద్యోగులు ఆందోళనకు గురికావద్దని ఆయన హితవు పలికారు. కరోనా మహమ్మారి సమయంలో మూడు డీఏలు ఇచ్చిన సీఎం జగ్ కు చంద్రశేఖర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.