FbTelugu

ఏపీ-టీఎస్ సరిహద్దులు మూత

గుంటూరు: దాచేపల్లి మండలం పొందుగుల వద్ద ఆంధ్ర – తెలంగాణ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద వాహనాలను అపివేస్తున్నారు. అత్యవసర వాహనాలను మాత్రమే వెళ్ళేందుకు అనుమతిస్తున్నారు.

గురజాల డీఎస్పీ మాట్లాడుతూ  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా మహమ్మారి త్వరలో మూడో దశకు వచ్చే అవకాశo ఉన్నందున ప్రజలు గుంపులుగా ఉండకూడదని అన్నారు.

అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటినుండి బయటకు రాకుండా ఉండాలని సూచించారు. లారీలు వాళ్ళు కూడా ఎక్కడి వాహనాలు అక్కడే అపుకోవాలని, చెక్ పోస్టుల వద్దకు  వచ్చి ఇబ్బందులు పడొద్దని సూచించారు. తమను వెళ్లనివ్వాలని పలువురు వాహనదారులు కోరినప్పటికీ దాటేందుకు అనుమతించలేదు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More