FbTelugu

ఏపి చెక్ పోస్టుల వద్ద భారీగా వాహనాలు

కృష్ణా: అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మధ్యాహ్నం 12 గంటల తరువాత ఏపి కి వచ్చే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. ఏపి-తెలంగాణ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ గరికపాడు వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్నారు.
గరికపాడుతో పాటు ఇతర చెక్ పోస్టుల వద్ద కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా నుంచి వచ్చే వాహనాలను కూడా నిలిపివేశారు. అనుమతులు ఉన్న వాహనాలను ఏపి లోకి అనుమతిస్తూ, అనుమతులు లేని వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. అంతరాష్ట్ర సరిహద్దుల్లో కొత్త వివాదం చోటు చేసుకుంది. తెలంగాణ భూభాగంలో చెక్ పోస్టు పెట్టవద్దని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు తెలంగాణ పోలీసులు చెప్పారు. తెలంగాణ పోలీసులు వినతి మేరకు కృష్ణా జిల్లా పోలీసులు ఏపి భూభాగంలో చెక్‌పోస్టు ఏర్పాటు చేసుకున్నారు. ప్రొక్లెయినర్‌తో పోలీసులు డివైడర్‌ను చదును చేసి చెక్ పోస్టు సిద్ధం చేశారు.

ఆడ్వన్స్ బుకింగ్ రద్దు…
రాష్ట్రంలో కర్ఫ్యూ దృష్ట్యా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. బస్సుల్లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ సదుపాయం రద్దు చేసింది. దూరప్రాంతాలకు నడిచే అన్ని బస్సు సర్వీసుల రిజర్వేషన్లు రద్దు చేశారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 18 వరకు ముందస్తు రిజర్వేషన్లు నిలిపివేశారు. బస్టాండ్ కు వచ్చిన ప్రయాణికులకు అనుగుణంగా అప్పటికప్పుడు బస్సులు సమకూర్చి గమ్యస్థానాలకు పంపించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.