FbTelugu

కేసులకు భయపడి మోదీ భజన: అచ్చెన్న

అమరావతి: కోర్టు కేసుల భయంతోనే సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని పొగుడుతున్నారని, ఝార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్ పై మెప్పుకోసమే విమర్శలు చేశారని ఏపి టిడిపి అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు విమర్శించారు.

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్, జగన్ ను విమర్శించలేదని, ప్రధాని మోదీ ని విమర్శించారని ఆయన గుర్తు చేశారు. కేసులు పెట్టాల్సింది చంద్రబాబు నాయుడుపై కాదని, ప్రజల చావుకు కారణమవుతున్న జగన్ పై పెట్టాలన్నారు. ఇవాళ మీడియాతో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, కరోనా స్ట్రెయిన్ వైరస్ కట్టడిలో జగన్ రెడ్డి విఫలం అయ్యారన్నారు. ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేసి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. చదువురాని వ్యక్తి రాష్ట్రంలో సిఎం గా ఉన్నా ప్రజలను కాపాడేవారని ఆయన అన్నారు. పొరుగు రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలని అచ్చెన్నాయుడు అన్నారు

You might also like

Leave A Reply

Your email address will not be published.