FbTelugu

పుష్కరాలపై వైసిపి అబద్దపు ప్రచారం: అచ్చెన్నాయుడు

విశాఖపట్నం: రాష్ట్రంలోని ఆసుపత్రులలో ఆక్సిజన్ లేక 106 మంది కరోనా రోగులు మృతి చెందారని, అవన్నీ రాష్ట్ర ప్రభుత్వ హత్యలేనని ఏపి టిడిపి అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు విమర్శించారు.
ఇవాళ అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ, పుష్కరాల్లో అమాయక ప్రజలు చనిపోయారని చంద్రబాబు నాయుడుపై 5 ఏళ్ళు వైసిపి నాయకులు విమర్శలు చేశారని, ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్, మందులు, బెడ్స్, ఆహారం మౌలిక సదుపాయాలే లేవన్నారు. ప్రజలు పిట్టల్లా రాలుతుంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ప్రాణాలు రక్షించాలని ఆర్తనాదాలు చేస్తుంటే దహన సంస్కరాలకు రూ.15 వేలు ఇస్తారా అని మండిపడ్డారు. ఈ సమయంలో బాధ్యత గల ప్రభుత్వం అంటే కరోనా బాధితుల ను ఆదుకోవాలన్నారు. వైద్యం కోసం వెళ్లిన ఆంధ్రులను పక్క రాష్ట్రంలో అడ్డుకుంటున్నారు, మన రాష్ట్రంలో మీకు ఎందుకు ఈ ఆలోచన కలగడం లేదని అచ్చెన్నాయుడు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎల్లుండి అసెంబ్లీ నిర్వహిస్తున్నామని చెబుతున్నదన్నారు. సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి వింత మనిషి, వింత చేష్టలు చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాలి. ఇప్పుడు కరోనా ఉంది ఎలా అసెంబ్లీ పెడుతున్నారు. ఒక్క రోజు పెట్టి తూతూ మంత్రంగా చేయాలని చూస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయ్యింది. 2 ఏళ్ల లో ఎన్ని సార్లు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారో చెప్పాలన్నారు. ఒక్క రోజు అసెంబ్లీ పెట్టడం ఏ ధర్మం అన్నారు. మార్చి నెలలో కావాలని సమావేశాలు పెట్టలేదు.. ఈ సమయంలో సమావేశాలు పెట్టడాన్ని బహిష్కరిస్తున్నామని ఆయన అన్నారు. కష్టాల్లో ఉన్నపుడు ప్రజలను ఆదుకోవాలన్నారు. మాక్ అసెంబ్లీ జూమ్ ద్వారా పెట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజలకు తెలియచేస్తామని అచ్చెన్నాయుడు అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.