అమరావతి: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ సలహాదారు అజయ్ వ్యాఖ్యలపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. వివరాల్లోకెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యూనిట్ కరెంటును రూ.2.70 చొప్పున ఇస్తుంటే.. ఏపీ ప్రభుత్వం వినియోగదారులకు రూ.9 కి అమ్ముతున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
ఇదిలా ఉండగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం యూనిట్ కరెంటుకు రూ.9.84 చొప్పున అంటగడుతోందని ఏపీ సలహాదారు అజయ్ కల్లం అన్నారని ఈ ఇద్దరిలో ఎవరి మాటలు నమ్మాలంటూ రామకృష్ణ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై సీఎం జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు.