FbTelugu

రామున్ని పూజిస్తున్న గొప్ప నేత జగన్: స్పీకర్ తమ్మినేని

శ్రీకాకుళం: రామతీర్థం ఘటనలో నిందితులను పట్టుకుని శిక్షించే పయత్నం చేస్తుంటే మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రదబాబు నాయుడు నీతిమాలిన రాజకీయం చేస్తున్నారని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు.
తిరుమలలో అలిపిరి సంఘటనను చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి అని ఆయన చురక అంటించారు. వెంకటేశ్వరస్వామి ఒకసారి హెచ్చరిక చేసినా చంద్రబాబుకు ఇంకా బుద్ధిరాలేదన్నారు. శ్రీరాముడు పుట్టిన రామభూమిలో జరిగిన ఈ ఘటనను ఎవరిమీదకు నెట్టేస్తారని ప్రశ్నించారు. మతాలు, కులాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు చేసే కుట్ర ఇది అని ఆయన అన్నారు. దోషులు ఎవరైనా సరే ప్రభుత్వం శిక్షిస్తుందని తమ్మినేని అన్నారు.

ప్రభుత్వం పై బురదజల్లి రాజకీయలబ్ధి పొందాలని చూడటం సరికాదన్నారు. రాముడిని ఆరాధించే సమాజం ఇది… తప్పు ఎవరు చేసినా తప్పేనన్నారు. దేవాలయాల్లో జరుగుతున్న ఘటనల్లో సీఎం జగన్ పై బురద జల్లాలని చూస్తున్నారు. ఒక్కసారి గతానికి వెళ్లితే… దేవాలయాలకు సంబంధించి ఎవరెన్ని కుంభకోణాకు పాల్పడ్డారో చరిత్ర చెబుతుందన్నారు. వైసీపీ పార్టీకి పెరుగుతున్న ప్రతిష్టను చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. కుట్రతో, పథకం ప్రకారం దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసి జగన్ పై ఆరోపణలు చేస్తున్నారని తమ్మినేని ఖండించారు.
మనుషుల్లో దేవుడిని చూసే గొప్ప మానవతావాది సీఎం జగన్ అన్నారు. శ్రీరామచంద్రుడుని పూజించే గొప్ప వ్యక్తి జగన్, అలాంటి నాయకుడి పై నీలాపనిందలు వేయడం సరికాదని అన్నారు. జగన్ పై వస్తున్న ఆరోపణలను అందరూ ముక్తకంఠంతో ఖండించాలన్నారు. దేవాలయాల్లో విధ్వంసాలకు పాల్పడుతున్న వారు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరుతున్నానని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.