FbTelugu

 ఏపీ స్పీకర్, మంత్రి క్యాంప్ ఆఫీసుల మూత

అమరావతి: కరోనా ఉగ్రరూపం దృష్ట్యా ప్రజా ప్రతినిధులు అప్రమత్తమవుతున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్ తమ క్యాంపు కార్యాలయాలను మూసివేశారు.

గురువారం నుంచి తమ క్యాంప్ కార్యాలయాలకు ఎవరూ రావద్దని, రెండు వారాల పాటు మూసివేసి ఉంటాయని వారు తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇద్దరు వేర్వేరు ప్రకటనలో తెలిపారు. వీరి బాటలో మరికొందరు నడిచే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

You might also like