FbTelugu

ఏపీ ఎస్ఈసీ పదవీకాలం పొడగిపు ?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో పంచాయితి ఎన్నికల నిర్వహణ విషయంలో కోర్టులో గ్రీన్ సిగ్నల్ రావడంతో మంచి ఊపులో ఉన్న ఎస్ఈసీ ప్రభుత్వానికి మరో ఇవ్వనున్నట్టే సంకేతాలు వస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల తర్వాత ఇక మిగిలి ఉన్న ఎంపీటీపీ, జడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికలను కూడా పూర్తి చేయాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారా ?

ఇందుకోసం తన పదవీకాలాన్ని సైతం పొడిగించుకునేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. 2016 ఏప్రిల్‌ ఒకటో తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది మార్చి 31న రిటైర్‌ కావాల్సి ఉంది. కాగా గతంలో ఒక సారి ప్రభుత్వం నిమ్మగడ్డను 2 నెలలు పదవి నుంచి తప్పించింది. ఇప్పుడు ఈ రెండు నెలల కాలాన్ని తిరిగిపొందాలని నిమ్మగడ్డ భావిస్తున్నారు. తన సర్వీసును మార్చి 31తో ముగించకుండా మరో రెండు నెలల పాటు పొడిగించుకోవాలని చూస్తున్నారు. పంచాయతి ఎన్నికలు ముగియగానే మున్సిపల్‌ ఎన్నికలకు, జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి తన పదవీకాలాన్ని పెంచుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. అయితే ప్రభుత్వం ఈ వాదనలను తిప్పికొడుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.