అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో త్వరలో పంచాయతి ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ లు విడివిడిగా భేటీ అయినారు. ఈ భేటీలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడంపై చర్చించినట్టు తెలుస్తోంది.
ప్రభుత్వానికి, ఎస్ఈసీకి మధ్య అంతరం తగ్గించేందుకు గవర్నర్ ప్రయత్నించినట్టు సమాచారం. ఇరువురూ పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. పంచాయతీరాజ్ అధికారుల అభిశంసన అంశంపై ఎస్ఈసీతో గవర్నర్ మాట్లాడారు. ఎన్నికలకు పూర్తిగా సహకరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌ను ఎస్ఈసీ కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లతో పాటు తాము తీసుకుంటున్న చర్యలను వివరించారు.