FbTelugu

వకీల్ సాబ్ సినిమాపై ఏపి సర్కార్ అప్పీల్

అమరావతి: జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా టిక్కెట్లు 3 రోజుల పాటు పెంచుకోవచ్చంటూ ఏపి హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సవాల్ చేయనున్నది.

ఏపీ ప్రభుత్వం వివరాలతో కాసేపట్లో హౌస్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేయనున్నది. వకీల్ సాబ్ సినిమాకు మూడు రోజులపాటు టిక్కెట్ ధరలు పెంచుకోవచ్చని శుక్రవారం సాయంత్రం హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో పవన్ కళ్యాణ్ అభిమానులు, సినిమా థియేటర్ల యజమానులు పండుగు చేసుకున్నారు. ఈ సినిమా కు బెని ఫిట్ షోలు, ప్రిమియర్ షో లు ఆపడంపై ఇప్పటికే జనసేన, వైసిపి ల మధ్య మాటల యుద్దం నడుస్తోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.