FbTelugu

విజ‌య‌సాయి ప్రొడ‌క్ష‌న్స్ మిడ‌త‌ల‌దండు!

విప‌క్షాలు ఎంత మొత్తుకున్నా.. గిట్ట‌ని వారు మ‌రెంత ప్ర‌చారం చేసినా విజ‌య‌సాయి.. విజ‌యసాయే. వైసీపీలో నెంబ‌రు 2 ఎవ‌రంటే మ‌రో డౌట్ లేకుండా ఆయ‌నే అనేంత‌గా చెలామ‌ణి అవుతుంటారు. అపుడెపుడో ఎల్జీపాలిమ‌ర్స్‌లో విష‌వాయువ‌లు బ‌య‌ట‌కు రావ‌టం.. సీఎంజ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లేట‌పుడు.. కారులో నుంచి దిగ‌టం.. ఇవ‌న్నీ విజ‌య‌సాయికి చెక్ అనుకున్నారు. కానీ.. అబ్బే అలాంటిదేమీ లేదు.. నా స్థానం ఎప్పుడూ ఒక్క‌టేనంటూ విజ‌యుడు మాత్రం ధీమా త‌గ్గ‌నీయ‌ట్లేదు. ట్వీట్ల‌తోనే ప్ర‌త్య‌ర్థుల‌కు మొట్టికాయ‌లు వేస్తాడు. తిట్టాడా.. పొగిడాడా అనుకునేంత‌లోనే వైసీపీలోని సోష‌ల్ మీడియా గ్రూపు దాన్ని విశ్వం చుట్టేసేలా ప్ర‌చారం చేస్తుంది.

తాజాగా.. టీడీపీ మిడ‌త‌ల దండు.. క‌మ‌లం పువ్వుపై దాడి చేస్తున్నాయంటూ ఏదో ట్వీటారు. నిజానికి ఇది కొత్త‌దేం కాదు. చంద్ర‌బాబు తాను 2018లో చేసిన త‌ప్పు తెలుసుకునేందుకు రెండేళ్లు ప‌ట్టింది. అప్ప‌టికే చేత‌లు కాలాయి. మూతులు వాచాయి. దీంతో వాస్త‌వంలోకి వ‌చ్చి న‌రేంద్ర‌మోదీ మాత్రమే అమ‌రావ‌తికి న్యాయం చేయాలంటూ కొత్త వాద‌న తెచ్చాడు. 200 రోజుల అమ‌రావ‌తి దీక్ష‌ను భూత‌ద్ధంలో చూపుతూ.. ఆ రోజే క‌లిసొచ్చిన అల్లూరి జ‌యంతిని చ‌క్క‌గా వాడు కున్నారు. ఇప్ప‌టికే సు జ‌నాచౌద‌రి అండ్ బ్యాచ్ క‌మ‌లంలో చేరి జ‌బ్బ‌లు చ‌రుస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో ఎలాగైనా దీనికి విరుగుడు మంత్రం చూసే ప‌నిలో విజ‌య‌సాయి ట్వీట్ చ‌ర్చ‌నీయాంశ‌మైంద‌న్న‌మాట‌.

You might also like