FbTelugu

విశాఖ ఉక్కు పై ఏడాది క్రితమే కన్నేసిన జగన్

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో కన్ను వేశారని, ఏడాది క్రితమే కుంభకోణానికి ప్రణాళిక వేశారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎస్.శైలజానాథ్ ఆరోపించారు.

సంవత్సరం క్రితమే ఒక ప్రైవేటుకంపెనీతో జగన్ చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆయన అన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణ కారణంగా రూ.2 లక్షల కోట్లు చేతులు మారుతున్నాయన్నారు. ప్రత్యేక హోదా తెస్తామని గెలిచిన వైసీపీ ఎంపీలు చేతగాని వాళ్లుగా మారి, మోదీకి ఊడిగం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రిమోట్ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకుని లేఖల పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు. ప్రైవేటీకరణపై జగన్ ఎందుకు నోరు విప్పడం లేదని శైలజానాథ్ ప్రశ్నించారు. ఏడాది క్రితం పోస్కో తో జగన్ చర్చలు జరిపింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.