FbTelugu

నాలుగు దశల్లో ఏపీ పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డ

* ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల
* ఈ నెల 25నుంచి 27వరకు నామినేషన్ల స్వీకరణ
* 31న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో నాలుగు దశల్లో ఏపీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఏపీ పంచాయతి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఇవాళ ఆయన విజయవాడలో విడుదల చేసి మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికలు సకాలంలో నిర్వహించడం ఈసీ విధిఅని అన్నారు. రెవెన్యూ డివిజన్‌ ప్రతిపాదికన ఎన్నికలు జరుగుతాయన్నారు. అయితే సుప్రీంకోర్టులో పంచాయతి ఎన్నికల నిర్వహణపై ఉన్న కేసు విచారణ సోవమారం జరగనుంది. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని తప్పకుండా పాటిస్తామని స్పష్టం చేశారు.

తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ నెల 25నుంచి 27వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. 31న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు. ఫిబ్రవరి 5న ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్‌ నిర్వహించి అదే రోజు లెక్కింపు, ఫలితాలను ప్రకటించనున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.