FbTelugu

ఏపీ కృష్ణా జలాల దోపిడి: నాగం

హైదరాబాద్: తెలంగాణ కు కృష్ణా జలాల్లో రావాల్సిన న్యాయబద్ధమైన నీటిని కూడా ఆంధ్ర వాళ్ళు తీసుకుపోతుంటే సీఎం కేసీఆర్ నోరు మూసుకున్నారని మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి ఆరోపించారు.

ఏపీ కి 34 టీఎంసీల నీరు నికర జలాలు, 67 టీఎంసీల వరద జలాలు అయితే వాటిని 17 రోజుల్లో తీసుకుపోయే వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారన్నారు. కానీ ఇప్పటికే వందల టీఎంసీ ల నీరు అక్రమంగా తరలంచుకుని వెళ్తున్నారని అన్నారు. ఒక బేసిన్ లోని నీళ్లను మరో బేసిన్ లోకి ఎలా తరలిస్తారని ఆయన ప్రశ్నించారు.

కేసీఆర్ కు పంపులు, మోటార్లు, రీ ఇంజనీరింగ్, రీ డిజైన్ తప్ప ఏమీ తెలియదన్నారు. కృష్ణా నీళ్లు దోచుకుపోతే గోదావరి నీటిని ఎత్తిపోసి కమిషన్లు దోచుకోవాలని చూస్తున్నారని నాగం ఆరోపించారు. ఏపీ లో రెండు పంటలు పండిస్తుంటే మనం ఎండిపోతున్నామన్నారు. ఈ విషయంలో రైతులను చైతన్యం చేసి కృష్ణా పరివాహక ప్రాంత రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.