FbTelugu

పాస్ పోర్టు వెరిఫికేషన్ లో ఏపీ ప్రథమం

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందించారు. పాస్ పోర్టు వెరిఫికేషన్, క్లియరెన్స్ లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మొదటి స్థానం అవార్డు దక్కించుకున్నది.

రాష్ట్ర ప్రజలకు మెరుగైన రీతిలో పాస్ పోర్టు సేవలను అందిస్తున్న అందుకుగాను అవార్డు ను కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలో వరుసగా రెండో సారి మొదటి స్థానం సొంతం చేసుకున్నది.

పాస్ పోర్టు వెరిఫికేషన్, క్లియరెన్స్ లో ఉత్తమ సేవలు అందిస్తున్న సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు పోలీస్ శాఖ మరింతగా సన్నద్ధతో పనిచేస్తుందని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు.

You might also like