FbTelugu

దేశంలోనే ఇంటర్ ఫలితాల్లో ఆదర్శం: మంత్రి సురేష్

విజయవాడ: ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు.

కోవిడ్ ప్రభావం రీత్యా ఇవాళ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేశామని మంత్రి సురేష్ అన్నారు. దేశంలొనే ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసిన ఘనత మనదేనన్నారు. వాల్యూయేషన్ మొదలు పెట్టిన నాలుగు రోజులుకే కేంద్రం లాక్ డౌన్  ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ కలిపి 10,65,155 మంది పరీక్ష రాశానన్నారు. ఇంటర్ లో గ్రేడ్ విధానాన్ని రద్దు చేసినందున మొదటి సంవత్సరం ఫలితాల్లో సబ్జెక్ట్ ల వారీగా మార్కులు ప్రకటించామన్నారు. రెండవ సంవత్సరం పలితాల్లో సబ్జెక్ట్ ల వారీగా గ్రేడ్ పాయింట్లలో పలితాలు ప్రకటించామని తెలిపారు. ఎవరికైనా ఫిర్యాదులుంటే 18002749868 నెంబరులో ఫిర్యాదు చేయవచ్చని సురేష్ అన్నారు.

ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యూయేషన్ కు సెంటర్లను పెంచి, 25 వేల మందిని స్పాట్ వాల్యూయేషన్ కు ఉపయోగించామని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో అడ్వాన్స్ పరీక్షలకు ఆదర్శంగా నిలుస్తామన్నారు. పదవ తరగతి, డిగ్రీకి సంబంధించి కొన్ని పరీక్షలు ఇదే రీతిలో కొనసాగించాల్సిన అవసరం ఉందని సురేష్ అన్నారు.

ఇంటర్‌మొదటి సంవత్సరం పరీక్షలకు 5,07,230 మంది హాజరు కాగా 3.00,560 మంది పాసయ్యారన్నారు. ఉత్తీర్ణత శాతం 59 శాతం అన్నారు. పస్ట్ ఇయర్ బాలికల్లో పరీక్ష రాసిన విద్యార్ధినులు 2,57,169 మంది కాగా 1,64,365 మంది పాసైనట్లు మంత్రి వివరించారు. విద్యార్థినుల ఉత్తీర్ణత శాతం 54 అన్నారు. శాతం ఉత్తీర్ణత శాతం.పరీక్ష రాసిన బాలురలో 2,49,611 మంది లో 1,36,195 మంది పాసైనారు. బాలుర ఉత్తీర్ణతా శాతం 55 అని పేర్కొన్నారు.

రెండవ సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్దినీ, విద్యార్దులు 4,35,655 మంది కాగా 2,76,389 మంది పాసైనారని, ఉత్తీర్ణతా శాతం 63 అని మంత్రి తెలిపారు. రెండవ సంవత్సరం పరీక్ష రాసిన బాలికలు 2,22,798 కాగా 1,49,010 మంది పాసైనారని, బాలికల్లొ ఉత్తీర్ణతా శాతం 67 అని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.రెండవ సంవత్సరం బాలురలో పరీక్ష వ్రాసిన వారు 2,12,857 మంది కాగా 1,27,379 మంది పాసయ్యారని, బాలుర ఉత్తీర్ణత శాతం 60 అని అన్నారు.

 

ఉత్తీర్ణతా శాతం

ఇంటర్‌ఫస్ట్ ఇయర్ టాప్ 3 జిల్లాలు

1.కృష్ణా 75శాతం)

2.పశ్చిమ గోదావరి, గుంటూరు 65 శాతం

3. విశాఖపట్నం 63 శాతం

 

సెకండియర్ టాప్ 3 జిల్లాలు

1.కృష్ణా  75 శాతం

2.పశ్చిమ గోదావరి  71 శాతం

3.నెల్లూరు, విశాఖపట్న 68 శాతం.

You might also like