చిత్తూరు: ఏపీ, తమిళనాడు సరిహద్దులో మిడతలదండు ప్రజలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ఈ మిడతల దండు రాత్రికి రాత్రే పంటలను సర్వనాశనం చేసేస్తున్నాయి.
జిల్లాలోని గుడిపల్లి మండలం ఓఎన్ కొత్తూరు వైపు మిడతలు వస్తున్నాయి. దీంతో చిత్తూరు జిల్లా రైతులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగారు. మిడతల దండుపై ఫర్టిలైజర్స్ ను పిచికారి చేసి వారిని తరిమేందుకు యత్నిస్తున్నారు.