FbTelugu

చేనేత పరిశ్రమలో ఏపీ ముఖ్యమైన రాష్ట్రం: జగన్

అమరావతి: చేనేత పరిశ్రమలో అతి ముఖ్యమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు.

నేతన్నను చూసి గర్విస్తున్నామని ఆయన అన్నారు. నేతన్నకు అండగా ఉండేందుకు ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ నేతన్నలను ఏపీ ప్రభుత్వం ఆదుకుందని అన్నారు.

You might also like