FbTelugu

ఎస్సీల మధ్య వివాదం బాధాకరం: సుచరిత

గుంటూరు: ఎస్సీల మధ్య చోటుచేసుకున్న వివాదంలో మహిళ మృతి చెందడం చాలా బాధాకరమని ఏపీ హోంమంత్రి సుచరిత అన్నారు. ఇవాళ జిల్లాలోని వెలగపూడిలో రెండు వర్గాల(ఎస్సీలు) మధ్య జరిగిన ఘర్షణలో మరియమ్మ అనే మహిళ తీవ్ర గాయాలపాలై మృతి చెందింది.

ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి సుచరిత స్పందించారు. మరియమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దళితులందరూ స్నేహితుల్లా కలిసి ఉండాలని అన్నారు. మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.