FbTelugu

వామ్మో… ఏపీ కేసులు 5041

ఒక్కరోజే 56 మంది మృతి

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లెక్క మారుతోంది. ఎన్నడూ లేని విధంగా గడచిన 24 గంటల్లో అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31,148 నమూనాలను పరీక్షించారు. వారిలో 5,041 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 49,650కి చేరింది.

రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 22,890 మంది డిశ్చార్జి అయ్యారు. వివిధ కోవిడ్-19‌ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 26,118 మంది చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో 56 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి 642 మంది మరణించారు.

You might also like