FbTelugu

ఏపీ హైకోర్టు, సుప్రీం జడ్జీపై విచారణ జరపాలి: మంత్రి పేర్ని

తాడేపల్లి: న్యాయవ్యవస్థపై ఎంపీ పివి. మిథున్ రెడ్డి పార్లమెంటులో ప్రస్తావించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు దృష్టి పెట్టాలని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) డిమాండ్ చేశారు.

రాజకీయపార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వారు నేడు న్యాయ వ్యవస్థలో చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కుటుంబ సభ్యులు, మరికొంతమంది పెద్దల హస్తం ఉండబట్టే సీబీఐ విచారణ కోరుతున్నామన్నారు. ఇవాళ తాడేపల్లి వైఎస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయం లో మంత్రి పేర్ని వెంకట్రామయ్య మాట్లాడుతూ, అమరావతిలో అక్రమాలు జరగలేదని మాజీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు భావిస్తే.. సీబీఐ విచారణను ఆహ్వానించాలన్నారు.

అక్రమాలు జరగలేదని తేలితే.. కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటపడవచ్చని ఆయన అన్నారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను చంద్రబాబు భ్రష్టుపట్టించాడు.. ఆఖరికి న్యాయ వ్యవస్థను కూడా.. దశాబ్దాల పాటు రాజకీయ పార్టీలో పనిచేసిన వారు న్యాయ వ్యవస్థలో వున్నారని ఆరోపించారు. ఇప్పటికీ వారు టిడిపి, చంద్రబాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు.

రహదారుల అభివృద్ధి కోసం పెట్రో ఉత్పత్తులపై రూ.1 పెంచితే ఈనాడు గగ్గోలు పెడుతున్నదని ఆరోపించారు. ఆనాడు అమరావతి పేరుతో చంద్రబాబు సెస్ వేస్తే.. ఈనాడు అధినేత సీహెచ్. రామోజీరావు ఎందుకు స్పందించలేదు?. కేంద్రం ఏడాదిలో లీటర్‌పై రూ.10 ధర పెంచితే ఈనాడులో ఎందుకు కథనాలు రాలేదు? అని ప్రశ్నించారు. రామెజీకి చంద్రబాబు అంటే ప్రేమ… మోదీ అంటే భయం.. అన్నారు. రామోజీది మహాభారంతో దృతరాష్టుడి పాత్ర లాంటిదని మంత్రి పేర్ని ఎద్దేవా చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.