FbTelugu

ఆనందయ్య మందుపై కేంద్రానికి నోటీసులు: ఏపి హైకోర్టు

అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లో ఆనందయ్య ఆయుర్వేద మందుపై ఎవరు అనుమతి ఇవ్వాలి, ఆ మందుపై అభిప్రాయం ఏంటో తెలియజేయలని కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.మందులో ఏం కలుపుతున్నారో తెలుసుకుని దాని వల్ల ప్రజలకు ఇబ్బంది లేదంటే కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ అనుమతి ఇస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇవాళ ఏపి హైకోర్టులో ఆనందయ్య కరోనా మందుపై విచారణ జరిగింది.

ఆనందయ్య మందు వల్ల ఇబ్బందులు లేవని తేలితే కేంద్ర ఆయుష్ శాఖ అనుమతి ఇస్తుందని కేంద్రం తరఫు న్యాయవాది తెలిపారు. ఆయన ఇచ్చే మందు వల్ల ఇబ్బందులు లేవు కదా అని కోర్టు ప్రశ్నించగా, లిఖిత పూర్వకంగా తెలియచేస్తమని అన్నారు. మందుపై ఆయుర్వేద కౌన్సిల్ లో రిజిస్టర్ చేసుకోలేదని, అందువల్లే మందుపై పరీక్షలు జరుపుతున్నామని ప్రభుత్వం తెలిపింది. ల్యాబ్ ల నుంచి ఈ నెల 29న రిపోర్టులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. ప్రజలు మందు కావాలని కోరుతున్నారని, ఎదురు చూస్తున్నారని వీలైనంత త్వరగా రిపోర్టులు తెప్పించాలని హైకోర్టు సూచించింది.
మందు పంపిణీ ఆపాలని ఏపి లోకాయుక్త ఎలా ఆదేశాలు ఇస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఆనందయ్య తో కొందరు రాజకీయ నాయకులు ప్రైవేట్ గా మందు తయారు చేయించి తమ బంధువులు, తెలిసిన వారికి పంపిస్తున్నారని చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.