అమరావతి: ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపుపై వాదనలు జరుగుతున్న సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ ప్రారంభమైంది. పిటీషనర్ల తరఫున వేదుల వెంకటరమణ తన వాదనలు ప్రారంభించారు. అయితే ఆ సమయంలో పలువురు అడ్వకేట్లు ఆన్ లైన్ లోకి రావడం ప్రధాన న్యాయమూర్తికి ఆగ్రహం తెప్పించింది.
అనుమతించిన వారు కాకుండా అదనంగా 30 మంది ఆన్ లైన్ లోకి రావడంపై ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటీషనర్ల తరఫు న్యాయవాది వాదనలు జరుగుతుండగానే క్రాస్ ట్రాక్ కావడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇక విచరణ ఆపాల్సిందిగా ఆదేశించి, కేసును సోమవారానికి వాయిదా వేశారు. వచ్చే సోమవారం కోర్టులోనే విచారణ జరుగుతుందని, న్యాయవాదులను పిలిపించాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు. సోమవారం అందరూ సామాజిక దూరం పాటిస్తూ, నిబంధనలు పాటిస్తూ, కోర్టు కు హాజరు కావాలని చెప్పారు.