FbTelugu

సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ కు ఏపీ ప్రభుత్వం లేఖ

అమరావతి: పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టు స్టేటస్ కో ఎత్తివేయాలని సుప్రీంకోర్టు లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

అమరావతి రాజధాని కేసులో కెవియట్ వేసిన వారికి పిటిషన్ కాపీని పంపినట్లు సుప్రీంకోర్టు కు ఏపీ ప్రభుత్వం తెలియచేసింది. హైకోర్టు జారీ చేసిన స్టేటస్ కో పై అత్యవసర విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ను ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ కి లేఖ రాసింది. అయితే తమ వాదనలు వినాలని ఇప్పటికే అమరావతి రైతులు, జెఏసీ నాయకులు  కెవియట్ పిటిషన్ వేశారు.

You might also like