FbTelugu

మంచాల కొరతకు నాయకులే కారణం: డాక్టర్ జయధీర్

అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో మంచాల కొరతకు రాజకీయ నాయకులే కారణమని ఏపి గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ జయధీర్ ఆరోపించారు.

ఇవాళ జయధీర్ మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికైనా నాయకులు రెకమండేషన్లు ఆపకపోతే వారిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఏపి కి చెందిన అంబులెన్సులను తెలంగాణ ప్రభుత్వం ఆపటం దుర్మార్గమన్నారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న డ్రగ్స్ మాఫియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెకండ్ వేవ్‌తో రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయని, ప్రజలు చనిపోతున్నారని ప్రచారం చేయడం కరెక్ట్ కాదని హితవు పలికారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో 20% మాత్రమే కరోనా కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు. చాలా మంది పేషంట్లు ఆక్సిజన్ అవసరం లేకపోయినా వాటి కోసం అనవసరంగా గాబరాపడుతున్నారన్నారు.
ప్రస్తుతం 50% మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరం అవుతుందని ఆయన తేల్చి చెప్పారు. కొంతమంది భయంతో ఆక్సిజన్ మంచాల కోసం రికమండేషన్‌లు, పైరవీలు చేయిస్తే ప్రభుత్వానికి పిర్యాదు చేస్తామని అన్నారు. మంచాలు అవసరం లేకపోయినా వాటి కోసం ప్రయత్నాలు చేయవద్దన్నారు. హోం ఐసోలేషన్ లో ఉంటూ రోగం నయం చేసుకోవాలని జయధీర్ సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.