FbTelugu

తెలంగాణ వారికి కూడా ఎక్స్ గ్రేషియా : జగన్

అమరావతి: కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. దైవ దర్శనం చేసుకుని ట్రాక్టర్‌లో తిరుగి వస్తుండగా.. ఓ లారీ బలంగా ఢీకొట్టింది.

కాగా ఏపీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతులు తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. ప్రమాదం జరిగింది ఏపీలో గనుక తెలంగాణ వారికి కూడా ఎక్స్ గ్రేషియా వర్తింపచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

You might also like