FbTelugu

ఎస్‌ఈసీ కేసు పై సుప్రీంకు వెళ్లిన ఏపీ

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది.

ఎస్‌ఈసీ పదవీకాలం కుదిస్తూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను, జీఓలను ఏపీ హైకోర్టు కొట్టి వేసిన విషయం తెలిసిందే. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తిరిగి ఎస్‌ఈసీగా నియమిస్తూ ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. తమకు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉందని రెండు రోజుల క్రితం అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్ ప్రకటించారు కూడా.

You might also like