FbTelugu

ఎలక్ట్రిక్, సీఎన్జీ బస్సులపై ఏపీ దృష్టి

అమరావతి: దేశంలో రానురాను పెట్రోల్, డీజిల్ ధరలు మరింత భారం అయ్యే సూచనలు కన్పించడంతో ఏపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన ధరలపై దృష్టి సారించింది.
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించే వేతనాలు తరువాత అధిక ఖర్చు డీజీల్ పైనే పెడుతోంది. వేతనాలకు రూ.3వేల కోట్లు వెచ్చిస్తుండగా, డీజీల్ కు రూ.2100 కోట్లు చెల్లిస్తున్నది. లీటర్ కు రూపాయి పెరిగితే నెలకు అదనంగా రూ.2.40 కోట్ల భారం పడుతుంది. ఈ భారాన్ని తగ్గిస్తే తప్ప ఆర్టీసీ మనుగడ అసాధ్యమని గమనించిన ప్రభుత్వం ఇతర ఇందన వనరులపై చర్చలు ప్రారంభించింది. కొత్తగా 350 విద్యుత్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నది.

తిరుమలలో 150, విజయవాడలో 100, విశాఖపట్నంలో 100 విద్యుత్ బస్సులను నడపనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఫేమ్-2 పథకం కింద నిధులు అందచేందుకు సుముఖంగా ఉండడంతో విద్యుత్ బస్సుల వైపు చూస్తున్నారు. దీంతో పాటు సీఎన్జీ బస్సులను కూడా పెంచనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 302 సీఎన్జీ బస్సులు నడుస్తున్నాయి. విజయవాడ, తూర్పుగోదావరి రీజియన్ లో నడుపుతున్నారు. అదే విధంగా డిపోలలో ఖాళీ ప్రదేశాల్లో డీజిల్ బంకులు ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా కూడా కొంత ఆదాయం సమకూరనున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.