FbTelugu

లాక్ డౌన్ పై ఏపీ అదనపు గైడ్ లైన్స్

అమరావతి: లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనపు గైడ్ లైన్స్ జోడించింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ల వీడియో కాన్ఫరెన్స్ సూచనలతో పాటూ కొత్త గైడ్ లైన్స్ అమలు చేయనున్నట్టు ప్రకటించింది. వ్యవసాయరంగం, హార్టీ కల్చర్ పనులకు మినహాయింపులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

అదేవిధంగా ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ కు మినహాయింపు ఇచ్చినట్టు పేర్కొంది. ముఖ్యంగా ఆర్థిక రంగానికి లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్టు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులతో పాటూ టెలికం కేబుల్స్ కు అనుమతించనున్నట్టు తెలుస్తోంది. షరతులతో ఈ-కామర్స్ వాహనాలకు అనుమతి.

You might also like

Leave A Reply

Your email address will not be published.