FbTelugu

నేటితో ఏపీ తొలివిడత నామినేషన్లు ముగింపు

అమరావతి: నేటితో ఏపీ పంచాయతి ఎన్నికల తొలివిడత నామినేషన్లు పర్వం ముగియనుంది. అభ్యర్థులు ఇవాళ సాయంత్రం 5:00 గంటల్లోగా తమ నామినేషన్లు దాఖలు చేసుకోవాలని సూచించారు. నిన్నటికి రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌ స్థానాలకు దాదాపు 7,460, వార్డులకు 23, 318 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా సర్పంచ్‌ పదవికి 11,056, తూర్పు గోదావరి జిల్లాలో వార్డు స్థానాలకు అత్యధికంగా 4,678 నామినేషన్లు వచ్చాయని ఎన్నికల అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 4వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.