FbTelugu

ఏపీ ఈ పాస్ ఇక సులభం: కృష్ణబాబు

విజయవాడ: కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 3 నిబంధనల ప్రకారం ఏపీ సరిహద్దు చెక్ పోస్టుల్లో ప్రవేశాలపై సడలింపులు ఇచ్చినట్లు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టీ.కృష్ణబాబు తెలిపారు.

ఏపీకి వచ్చే వారు స్పందన వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకున్న తరువాత ఆటోమాటిక్ గా ఈ పాస్ కాపీ మొబైల్ ఫోన్, ఈ మెయిల్ కి వస్తుందన్నారు. దానిని చెక్ పోస్టులో నమోదు చేయించుకుని ఏపీలోకి ప్రవేశించవచ్చన్నారు. ఈ నమోదు వచ్చేవారి సంఖ్యను గుర్తించేందుకు మాత్రమేనని, ఆ తర్వాత ఆరోగ్య కార్యకర్తలు వారి ఆరోగ్యంపై దృష్టి పెడతారన్నారు. ఈ విధానం రేపటి నుంచి అమలు చేస్తారని కృష్ణబాబు తెలిపారు.

You might also like