FbTelugu

ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎండీగా చిన్న

అమరావతి: ఏపీ ప్రభుత్వ డిజిటల్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా చిన్న వాసుదేవ రెడ్డి నియమితులయ్యారు.

ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐ డ్రీమ్ ఛానల్ వ్యవస్థాపకుడిగా, సీఈఓ గా చిన్న వాసుదేవ రెడ్డి ఉన్నారు. వాసుదేవ రెడ్డి నెల్లూరు జిల్లాలోని కోటా మండలం విద్యానగర్ ఎన్ బీ కే ఆర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో ఇంజనీరింగ్ విద్యనభ్యసించి అమెరికా వెళ్లిపోయారు.

2009 లో చిత్తూరు జిల్లా మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2013 ఐ డ్రీమ్ ను ప్రారంభించి కార్పొరేట్ సంస్థ గా తీర్చిదిద్దారు.

You might also like