FbTelugu

డబుల్ మాస్క్ తప్పనిసరి: ఏపి డిజిపి

విజయవాడ: అత్యసవర సమయంలో బయటకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రెండు మాస్కులు ధరించాలని, శానిటైజర్ ను ఉపయోగించాలని ఏపి డిజిపి గౌతం సవాంగ్ విన్నవించారు. అది మీ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను కాపాడుతుందన్నారు.
మనమందరం జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా ని సమర్థవంతంగా జయిస్తామన్నారు. విజయవాడ నగరంలో పగలు కర్ఫ్యూ అమలుపై డిజిపి గౌతం సవాంగ్ పోలీసు కమిషనర్ శ్రీనివాసులుతో కలిసి ఆకస్మిక పర్యటన చేశారు. కరోనా లక్షణాలను గుర్తించిన వారు, హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు కాల్ సెంటర్ 104, 108 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కరోనా నిబంధనలను, లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించిన వారి సమాచారాన్ని 100, 112కి సమాచారం అందించాలని ఆయన కోరారు. కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు.. నిబంధనల మేరకు వాహనాల జప్తు చేస్తామన్నారు. అంతర్రాష్ట్ర కదలిక లపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు షరతులు కొనసాగుతాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించే వారికోసం రేపటినుండి ఈ-పాస్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నామని డిజిపి అన్నారు.

బాధితులు ఏదైనా ఫిర్యాదు చేయదలుచుకుంటే నేరుగా పోలీస్ స్టేషన్ కి రాకుండా అందుబాటులో ఉన్న ఏపీ పోలీస్ సేవ అప్లికేషన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎటువంటి రాజకీయ పార్టీల సభలు, సమావేశలకు అనుమతి లేదన్నారు. శుభకార్యాలకు సంబంధించి సంబంధిత స్థానిక అధికారుల వద్ద నిబంధనల మేరకు తప్పనిసరిగా అనుమతి పొందాలన్నారు. నిర్ధారణ కాని వార్తలు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై అప్రమత్తం గా వ్యవహరించాలని కోరారు. ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ అనుక్షణం మీ రక్షణ కోసం మీ వెంటే ఉంటుందని, మీరందరూ పోలీస్ శాఖకు సహకరించాలని డిజిపి గౌతం సవాంగ్ కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.