FbTelugu

అత్యాచార ఘటన బాధాకరం: ఏపి డిజిపి

అమరావతి: కృష్ణా నది పరివాహక ప్రాంతంలో శనివారం రాత్రి ఒక యువతి పై జరిగిన అత్యాచార ఘటన అత్యంత హేయం, బాధాకరం ఏపి డి‌జి‌పి గౌతం సవాంగ్ ఖండించారు.
ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను పట్టుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా ఇప్పటికే కృష్ణ, గుంటూరు జిల్లా ఎస్పీలు, విజయవాడ కమిషనర్ ల కు ఆదేశాలు జారీ చేశారు.

ఇటువంటి అమానవీయ చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు ఆయన హెచ్చరించారు. నేరానికి పాల్పడిన నిందితులు ఎంతటివారైనా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. మహిళల భద్రత మా ప్రధమ కర్తవ్యం. ఎన్నో చర్యలు చేపట్టినా, ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. ప్రతి మహిళ దిశా యాప్ ను ఖచ్చితంగా వాడాలని డిజిపి సవాంగ్ కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.