FbTelugu

ఓట్లు స్వేచ్ఛగా వేయాలి: డీజీపీ గౌతం సవాంగ్

విజయనగరం: ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ జిల్లాలో 4వ విడత జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, భద్రతను పరిశీలించారు. కొత్తవలస పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, భద్రతను పరిశీలించి, ఓటు వేసేందుకు వచ్చిన వృద్దులతో మాట్లాడారు.

పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు. ప్రజలను స్వేచ్చ గా ఓటు వేయాల్సిందిగా గౌతం సవాంగ్ కోరారు. డీజీపీ వెంట విశాఖపట్నం రేంజ్ డిఐజి ఎల్.కె.వి. రంగారావు, జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, జాయింట్ కలెక్టర్ డా. కిశోర్ కుమార్, పోలీసు అధికారులు ఉన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.