FbTelugu

ఎస్టి కాదని ఎలా చెబుతారు?: డిప్యూటి సిఎం పుష్ప

శ్రీకాకుళం: మేము షెడ్యూలు తెగలు (ఎస్టి) వర్గానికి చెందినవారం కాకపోతే 2014లో తమ కుటుంబానికి డిజిటల్ సర్టిఫికెట్లు ఎలా ఇచ్చారని ఏపి డిప్యూటి సిఎం పుష్పశ్రీ వాణి సవాల్ విసిరారు.
రాజకీయ కుట్రలో భాగంగా కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని ఆమె ఖండించారు. తన సోదరి వెంకట రామతులసి 2008 స్పెషల్ డి.ఎస్.సి లో ఐటిడిఎ లో స్కూల్ అసిస్టెంట్ గా ఎంపికయ్యారన్నారు. జిఒ 3 ప్రకారం ఆ ఉద్యోగానికి స్థానికే అర్హలు కావడంతో సోదరిని అనర్హురాలిగా ప్రకటించారన్నారు. ఎస్టి కాకపోవడం మూలంగానే ఉద్యోగం రాలేదని కొందరు ప్రచారం చేస్తున్నారని, రుజువు చేస్తారా అని ఆమె నిలదీశారు. నేను రాజకీయాల్లోకి రాక ముందే బుట్టాయగూడెం మండలంలో తన సోదరికి ఎస్టి సర్టిఫికెట్ ఇచ్చారన్నారు.
నేను ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన తరువాత తన కులంపై కొందరు ఫిర్యాదు చేశారన్నారు. తహశీల్దార్ ఇచ్చిన కుల ధృవపత్రం రిటర్నింగ్ అధికారికి చూపించడంతో ఫిర్యాదులు బుట్టదాఖలు అయ్యాయన్నారు. పాలకొండ నియోజకవర్గం టిడి పారాపురం వెళ్లి తమ కుటుంబం గురించి విచారణ చేసుకోవచ్చని పుష్పశ్రీ వాణి విమర్శకులకు సమాధానమిచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.